Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ

విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని చిన్న బజార్లో ఉన్న హెచ్ఎన్ఎస్ 5 నెంబర్ బీడీ ఫ్యాక్టరీలో గురువారము ఫయాజ్ భాష సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు హీరాపురం ఫయాజ్ భాష చేతుల మీదుగా పేద హిందూ, ముస్లిం, మహిళలకు, పురుషులకు దుస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండగంటే ప్రతి ఒక్కరూ సంతోషంతో జరుపు కుంటారు. పేద వారు కూడా సంతోషంతో పండగ జరుపు కోవాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరంలో భాగంగానే ప్రతి ముస్లిం కుటుంబం సుఖ సంతోషాలతో రంజాన్ పండుగను జరుపు కోవాలన్నారు. తమ ఉడతా భక్తిగా ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ రంజాన్ మాసం పురస్కరించుకొని దాదాపు 2,100 మందికి మహిళలకు చీరలు, పురుషులకు షర్టు, పంచలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వక్ బోర్డ్ ప్రెసిడెంట్ షాషావలి వైస్ ప్రెసిడెంట్ వై. మహబూబ్ బాషా వైఎస్ఆర్సిపి నాయకులు చవ్వా రాజశేఖర్ రెడ్డి, ఉమ్మడి గురు ప్రసాద్ రెడ్డి, దూదేకుల సేవా సంఘం అధ్యక్షుడు నబి రసూల్, అస్లాం, షామీర్, జానీర్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img