Monday, March 27, 2023
Monday, March 27, 2023

పోటీ విజేతలకు మసీద్ లో సన్మానాలు

విశాలాంధ్ర -ధర్మవరం : ఈనెల 12వ తేదీన విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కురాన్ కంఠస్థ పోటీల్లో బి గ్రూపులో విజేతలుగా నిలిచిన ధర్మారానికి చెందిన మహమ్మద్ రైహాన్ జైద్ కు జామియా మసీదులో వైస్ ముత్తు వల్లి డాక్టర్ వలి సాబ్ కార్యదర్శి హైదర్ వలీ శుక్రవారం ఘనంగా సన్మానించారు. అదేవిధంగా కురాన్ కంటస్థ రాష్ట్రస్థాయి పోటీలో ఈ గ్రూపులో ఫైనల్ వరకు వెళ్లిన మరో విద్యార్థి ఎండి జై ద్ లను జామియా మసీదులో మౌలానా అబూ తాహిర్సాబ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. సత్కారంతోపాటు రెహాన్ కు 20000 రూపాయల చెక్కులు కూడా అందజేశారు. తదుపరి ఆ విద్యార్థులను మత పెద్దలు అభినందించి శుభాకాంక్షలు అందజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img