Monday, January 30, 2023
Monday, January 30, 2023

పోలీస్ యాక్ట్ 1861 జీవోను రద్దు చేయాలి

జీవోలను తీసుకొచ్చి ఉద్యమాలను ఆపలేరు సిపిఐ

విశాలాంధ్ర -తనకల్లు : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు తనకల్లు మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలిలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 1861 పోలీస్ యాక్ట్ ను వెంటనే రద్దు చేయాలని యాక్ట్ సంబంధించిన జీవో కాగితాలను అంబేద్కర్ కూడలిలో దగ్ధం చేశారు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 1861 పోలీస్ యాక్ట్ ప్రజాస్వామ్య విరుద్ధమని మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రశ్నించడం రాజ్యాంగం కల్పించిన హక్కుని రోడ్లమీద బహిరంగ ప్రదేశాలలో ప్రజా గొంతుకు వినిపించడం రాజ్యాంగ హక్కు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను తీసుకురావడం కనీసం సమస్యలపై గళం విప్పకుండా గొంతుకు నొక్కే ప్రయత్నం చేస్తోంది రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి ఓటమి భయం మొదలయ్యింది ఇలాంటి యాక్టులను తీసుకొచ్చి ఉద్యమాలను ఆపలేరు రాబోయే కాలంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఈ పోలీస్ యాక్ట్ రద్దు చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రెడ్డప్ప ఏపీ రైతు సంఘం మండల కార్యదర్శి ఇక్బాల్ సహాయ కార్యదర్శి కరిముల్లా మస్తాన్ వలి రవీంద్ర నాయక్ రామాంజులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img