విశాలాంధ్ర -తనకల్లు : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి పలికి బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపే విధంగా ప్రజలను చైతన్యం చేసే ప్రజాభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ శ్రేణులు పిలుపునిచ్చాయి ప్రచార బేరి పోస్టర్లను పురవీధుల్లో పట్టణ శివార్లలో అతికించే కార్యక్రమం చేపట్టారు సిపిఐ పార్టీ నాయకులు శ్రేణులు సానుభూతిపరులు ఈ ప్రచార బేరి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ పార్టీ మండల కన్వీనర్ రెడ్డప్ప రైతు సంఘం కార్యదర్శి ఇక్బాల్ అధ్యక్షుడు చౌడప్ప యాదవులుతెలిపారు.