Monday, March 27, 2023
Monday, March 27, 2023

ప్రజాధనాన్ని కొల్లగొట్టిన అ దాని ఆస్తులను జప్తు చేయాలి

సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్.
విశాలాంధ్ర-కదిరి : ప్రజాధనాన్ని కొల్లగొట్టిన అదాని ఆస్తులను జప్తు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట సిపిఐ పార్టీ నాయకులు, ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.అనంతరం వేమయ్య యాదవ్ మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అప్పగించి దేశ సంపదను దోచుకోమని అదాని,అంబానీకి సహకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో సామాన్యులను విస్మరించి బడా కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇవ్వడం విడ్డూరమని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు,పోలవరం ప్రాజెక్టుకు, రాజధాని అమరావతికి నిధులు కేటాయించకుండా బిజెపి పాలిత రాష్ట్రాలకు వరాలు ప్రకటించడం దుర్మార్గమన్నారు. పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో త్వరలో ఎన్నికల జరుగుతున్న సందర్భంగా అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడమే కాకుండా ఐదు వేల కోట్ల రూపాయల కేటాయించడంలో అంతర్యంమేమిటో తెలపాలన్నారు.అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మించడం వలన భవిష్యత్తులో రాయలసీమ ప్రజలకు సాగునీటికి అన్యాయం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు మధు నాయక్, సిపిఐ తాలూకా సహాయ కార్యదర్శి ఇమ్రాన్, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా నాయకులు గుడాల గొంది రమణ, పట్టణ కార్యదర్శి లియాకత్, గిరిబాబు,మహబూబ్, బాషా అలి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img