Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే గడపగడపకు కార్యక్రమం.. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

విశాలాంధ్ర -ధర్మవరం : నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే గడపగడపకు(గుడ్ మార్నింగ్) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం పట్టణంలోని 40 వ వార్డులో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇంటింటా వెళ్లి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్న, చిన్న సమస్యలను అప్పటికప్పుడే అధికారుల ద్వారా పరిష్కరించారు. వార్డ్ ప్రజలు కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు కొత్తగా నిర్మించిన డ్రైనేజీ పూర్తిగా బ్లాక్ అవుతోందని, ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అదేవిధంగా రోడ్లు కావాలని తెలిపారు. అనంతరం కుళాయి టాప్ కనెక్షన్లకు అక్రమంగా ఉన్నట్లు బయటపడడంతో, ప్రతి ఇంటింటికి కొలాయి కనెక్షన్ తప్పక ఉండాలని, ఇందుకు చర్యలను వెంటనే చేపట్టాలని కమిషనర్ మల్లికార్జున్ ను ఆదేశించారు. అంతేకాకుండా గుట్ట కింద పల్లి లో గల ఓ శిథిలావస్థకు చేరిన స్కూల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ శీతలావస్థకు చేరిన పాఠశాలను పూర్తిగా తొలగించి,పురపాలక సంఘ కార్యాలయాలకు అవసరమైన గదులను నిర్మించేటట్లు చర్యలు తీసుకోవాలని కమిషనర్ని సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీకి కట్టవలసిన అన్ని పనులను సకాలంలో చెల్లించి పురపాలక అభివృద్ధికి పాటుపడాలని ప్రజలను వారు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు భాగ్యలక్ష్మి, పెనుజురి నాగరాజు, కౌన్సిలర్ గజ్జల శివ, నాయకులు ఉడుముల రామచంద్ర, చాంద్ బాషా, కోఆప్షన్ మెంబర్ కరీం, సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img