Monday, March 20, 2023
Monday, March 20, 2023

ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు మంజూరు చేయడమే ధ్యేయం : ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

విశాలాంధ్ర-రాప్తాడు: ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు మంజూరు చేయడమే ధ్యేయమని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అన్నారు. మండలంలోని ఎర్రగుంట గ్రామంలో మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కల్గిన లబ్ధిని వివరిస్తూ అందుకు సంబంధించిన పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. రైతులకు రైతు భరోసా, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, పంటల బీమా, రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు పంపిణీ గ్రామాల్లోనే అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. సచివాలయాలను ఏర్పాటు చేసి వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నామన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సకాలంలో వర్షాలు కురవడంతో ప్రతి చెరువుకూ నీళ్లు రావడంతో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ప్రతి చెరువుకూ నీళ్లివ్వడంతోపాటు పేరూరు డ్యాంకు కూడా నీళ్లివ్వడంతోపాటు
రైతులు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారన్నారు. అనంతరం జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాల్మన్, కన్వీనర్ జూటూరు శేఖర్, యూత్ కన్వీనర్ చిట్రెడ్డి సత్తిరెడ్డి, మరూరు ఆది, సర్పంచ్ గొర్ల అరుణమ్మ, అగ్రిబోర్డు ఛైర్మన్ కేశవరెడ్డి, మరూరు ఆది, డీలర్ బయపరెడ్డి, చిన్నపరెడ్డి, వెంకటరామిరెడ్డి, నరసింహారెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ నారాయణరెడ్డి, రాము, రాజు, పంచాయతీ కార్యదర్శి అరుణ్, నాయకులు కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img