Friday, June 9, 2023
Friday, June 9, 2023

ప్రతి సంక్షేమ పథకము లబ్ధిదారులకు అందేలా చర్యలు చేపట్టాలి…

ఇంచార్జ్ ఎంపీడీవో మమతా దేవి
విశాలాంధ్ర -ధర్మవరం : ప్రతి సంక్షేమ పథకం లబ్ధిదారులకు అందేలా చర్యలు చేపట్టాలని ఇన్చార్జ్ ఎంపీడీవో మమతా దేవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం మండల పరిధిలోని గుడ్లూరు సచివాలయంలో సిబ్బందికి వాలంటీర్లకు సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే ప్రతి సంక్షేమ పథకం, అర్హులైన వారికి అందేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. సచివాలయంలో ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని, కొంతమంది వాలంటీర్లు విధులకు సక్రమంగా హాజరు కాలేదన్న ఫిర్యాదులు అందుతున్నాయని, వాటిపైన తాను ఎల్లప్పుడూ సీరియస్ గా ఉంటానని, మరోసారి ఇలాంటి పొరపాటు రానివ్వకూడదని సిబ్బందికి సూచించారు. రికార్డులను పక్కాగా ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, ఆన్లైన్లో సంక్షేమ పథకాల ప్రగతి వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని వారు సూచించారు. సచివాలయాలు ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా ఉన్నాయని, అటువంటప్పుడు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు తమ విధులను బాధ్యతగా భావించి, ప్రజలకు ఎల్లప్పుడూ అండదండలుగా ఉండాలని వారు తెలిపారు. అనంతరం మమతా దేవి పట్టణంలోని జీవనజ్యోతి పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష గదులలో అన్ని సదుపాయాలు ఉన్నాయా? లేదా? అన్న వాటిని వారు స్పష్టంగా పరిశీలించారు. ముఖ్యంగా తాగునీటి వ్యవస్థ, విద్యార్థులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేటట్లు చూడాలని తెలిపారు. పరీక్షలు సజావుగా నిర్వహించే విధంగా చీఫ్ చూపెట్టెంట్లు, ఇన్విజిలేటర్లు తమ విధులను బాధ్యతగా నిర్వహించేలా చూడాలన్నా రు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img