Monday, May 29, 2023
Monday, May 29, 2023

ప్రభుత్వ ఆసుపత్రికి టెస్టింగ్ కిట్స్స్ వితరణ.. శివయ్య

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి గీతా నగర్లో గల శివయ్య కుటుంబం 3 వేల రూపాయలు విలువచేసే టైఫాయిడ్,యూరిన్ టెస్ట్ కిట్స్ ను శనివారం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ పద్మలతకు అందజేశారు. ఈ సందర్భంగా శివయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి, వారి వైద్య సేవలు ఇప్పటికే వేలాదిమందికి మంచి సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ వైద్యులు సిబ్బంది సేవలు వెలకట్టలేనివని తెలిపారు. తనవంతుగా ప్రజలకు ఉపయోగపడే కిట్స్ ను ఇవ్వడం జరిగిందన్నారు. తదుపరి సూపర్డెంట్ పద్మలత దాతకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాత కుమారుడు లిఖిత్, సిబ్బంది జయమ్మ, అశోక్, హరి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img