Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి

విశాలాంధ్ర- రాప్తాడు : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని నాణ్యమైన పోషకాహారం అందించాలని ఏఐఎస్ఏ అనంతపురం నగర ఇన్చార్జ్ మంజునాథ్ కోరారు.
మండలంలోని గొందిరెడ్డిపల్లి గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ లో మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యేక సమావేశమై అందుతున్న వసతుల గురించి ఆరా తీశారు.
పాఠశాలలో ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులకు అందుతున్న పథకాలు, మెనూ ప్రకారం భోజన వసతి నాణ్యత తదితర వాటి గురించి ఆరా తీశారు. భోజనంతోపాటు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని వసతులు సక్రమంగా అందేలా చూడాలన్నారు. ఏవైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించి పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉజ్జినప్ప, మహేంద్ర, మహేష్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img