Friday, June 9, 2023
Friday, June 9, 2023

ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి

విశాలాంధ్ర-రాప్తాడు : మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిలో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమిని రాప్తాడు సర్పంచ్ సాకే తిరుపాలు కోరారు. బుధవారం ఆమె రాప్తాడుకు వచ్చిన సందర్భంగా వినతిపత్రం అందజేశారు. అనంతపురం, బెంగళూరు, కదిరి మీదుగా రాప్తాడు మీదుగా పలు భారీ నుండి అతి భారీ వాహనాలు వస్తుంటాయన్నారు. ఈ నేపథ్యంలో రాప్తాడు వై-జంక్షన్ కు రాగానే వాహన రాకపోకలు ఇబ్బందిగా ఉంటున్నాయని దీనివల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ హైవే అధికారులతో చర్చిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img