Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎంపీ

విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ పట్టణ సమీపంలోని చాబాల రహదారిలో ఆర్యవైశ్య స్మశాన వాటిక ప్రహరీ, మరియు ఆర్చ్ నిర్మాణానికి సోమవారం అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి భూమి పూజ చేశారు..రూ.15 లక్షల ఎంపీ నిధుల నుంచి ఈ పనులను ప్రారంభిస్తున్నట్లు వారు తెలిపారు.ఈ సందర్భంగా ఆ సంఘం సభ్యులు మాట్లాడుతూ స్థలం కేటాయింపు, ప్రహరీ నిర్మాణానికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఎంపి రంగయ్య లకు వారు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లలిత, జెడ్పిటిసి పార్వతమ్మ, వైస్ ఎంపీపీ నరసింహులు, ఉప సర్పంచ్ వన్నప్ప,ఈఓ గౌస్,అధికారులు,బిసి విభాగం జిల్లా అధ్యక్షుడు వీరన్న,పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు బసవరాజు, మాజీ ఎంపీపీ ఏసీ ఎర్రిస్వామి,మాజీ జెడ్పిటిసి తిప్పయ్య, ఆర్య వైశ్య సంఘం నాయకులు తిరుపాల్ శెట్టి,బుసెట్టి రమేష్,చిత్రాల కామిశెట్టి,నరేంద్ర, చెల్లూరు నాగరాజు, కొంజేటి సురేష్,బద్రి, కందూరు జగదీష్, కల్లూరు జగదీష్,ఉదయ భాస్కర్,కల్లూరు వెంకటేసులు, ఎన్సీఆర్ బాబు,బుసెట్టి విశ్వనాత్, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img