Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

ప్రారంభమైన ఉచిత శిక్షణా తరగతులు… ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభం కావడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిక్షణా తరగతులు నెల రోజులు పాటు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఉచిత సర్టిఫికెట్ కోర్సుగా కంప్యూటర్ శిక్షణ, కాంపిటీటివ్ ఎగ్జామ్ కు శిక్షణ ,స్పోర్ట్స్ సమ్మర్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ తరగతులు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు మాత్రమేనని తెలిపారు. ఇందులో కంప్యూటర్ విభాగంలో ఎమ్మెస్ ఆఫీసు, ట్యలి, జావా లాంటి కోర్సులు కాగా, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ శిక్షణలో అర్థమెటిక్, రీజనింగ్ లాంటి అంశాలతో పాటు, ఎస్ఎస్సి, గ్రూప్- వన్, టు బ్యాంకు పరీక్షలకు, పోలీస్ కానిస్టేబుల్ వంటి అర్హత పరీక్షలకు కళాశాలలో ఈ ఉచిత శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇటువంటి అవకాశాన్ని ఇంటర్మీడియట్ పూర్తి అయిన వారితోపాటు ప్రస్తుతం డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు కూడా వివిధ రకాల ఉద్యోగ అర్హత పరీక్షలకు కూడా శిక్షణ ఇస్తున్నట్లు వారు తెలిపారు. ఇటీవల మార్చి నెలలో జరిగిన ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపుకు ప్రజల నుండి ప్రత్యేక మద్దతు లభించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రాబియా బేగం, చిట్టెమ్మ , షమీవుల్ల ,గోపాల్ నాయక్, కిరణ్ కుమార్, భువనేశ్వరి, కే. స్వామి, పుష్పావతి, గౌతమి, ఆనందు, రామ్మోహన్ రెడ్డి తో పాటు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img