Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 19వ జాతీయ మహసభలను జయప్రదం చేయండి

విశాలాంధ్ర -ధర్మవరం : ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 19వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సత్యసాయి జిల్లా కార్యదర్శి ధర్మవరం విష్ణు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం నియోజకవర్గంలోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్థాపించి 83 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, మొదటిసారి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో జాతీయ మహాసభలను జరుపుకోవడం చాలా గర్వంగా ఉందని, 19వ జాతీయ మహాసభల సందర్భంగా పార్టీని బలోపేతం చేస్తూ యువతని, మహిళలను పెద్ద ఎత్తున ఉద్యమంలోకి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. 2023 అసెంబ్లీ ఎలక్షన్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని175 స్థానాలలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులను పోటీలో నిలుపుతుందని తెలిపారు. ఈసందర్భంగా వచ్చే 2023 ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ప్రముఖ పాత్ర పోషిస్తుంది అని అన్నారు.దేశంలో ప్రజాస్వామ్యం కూని చేపడుతుందని ఇటువంటి పరిస్థితులను నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతూ, ప్రజాస్వామ్యాన్ని బతికించే విధంగా యువతలో ఒక సోషలిజ భావాజాలన్ని ఏర్పాటు కోసం కృషి చేస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో ఈనెల 23 నుంచి 26 వరకు జరగనున్న జాతీయ మహాసభలను జయప్రదం చేస్తూ… పెద్ద ఎత్తున రాష్ట్రంలోని దేశంలోని రాజకీయాలలో మార్పులను తీసుకొచ్చేటందుకు కరసత్తు చేయనున్నామని తెలిపారు. ఈ యొక్క కరసత్తు చేయడానికి ఈయొక్క జాతీయ మహాసభలు వేదిక కానున్నాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో చిన్న ,గుణశేఖర్ ,చరణ్ ,ఓంప్రకాష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img