Monday, June 5, 2023
Monday, June 5, 2023

ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

విశాలాంధ్ర- ఉరవకొండ : ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పెద్ద కౌకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఫ్యామిలీ డాక్టర్ పి వి అనికేత్ ,డాక్టర్ చందన అన్నారు. సోమవారం పీహెచ్సీ పరిధిలోని రేణుమాకులపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ బి. రామాంజనేయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లతో పాటు హెల్త్ ఎడ్యుకేటర్ యు వెంకటరమణ తదితరులు మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్ విధానం వల్ల గ్రామ ప్రజలకు కలిగే ప్రయోజనాలు వివరించారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మందులను సకాలంలో వేసుకుంటూ సరైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలని ముఖ్యంగా ఉప్పు కారం తగ్గించిన ఆహార పదార్థాలను తీసుకోవాలని అవగాహన కల్పించారు. గర్భవతులు మరియు బాలింతలు అదనపు ఆహారం తీసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లింగ వివక్ష పై కూడా అవగాహన కల్పించారు. సమాజంలో స్త్రీ పురుషులు సమానమని కానీ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో తల్లిదండ్రులు అపోహలు మరియు మూఢనమ్మ కాలను నమ్మి మగ బిడ్డ మాత్రమే వారసుడుగా ఉండాలని, గర్భం సమయంలోనే గర్భ నిర్ధారణ పరీక్షలు చేయించుకొని ఆడబిడ్డ అని తేలితే అబార్షన్లు చేయించుకుంటూ బ్రూణ హత్యలకు పాల్పడుతున్నారని. ఈ విధంగా లింగ నిర్ధారణ పరీక్షల చేయించడం చేయించుకోవడం చట్టరీత్యా నేరమని అందుకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు మూడు నుండి ఐదు లక్షల జరిమానా విధిస్తారని అవగాహన కల్పించారు. వడదెబ్బ గురించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ మరియు ఆరోగ్య సిబ్బంది గృహాలను సందర్శించి అవసరమైన వారికి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ చౌడప్ప, నాగరత్నమ్మ,ఆరోగ్య సహాయకుడు ఎం ప్రసాదరావు, ఏఎన్ఎం నాగమ్మ, ఎం.ఎల్ .హెచ్ .పి మౌనిక, ఆశకార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img