Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

ఫ్యామిలీ ఫిజీషియన్ను సద్వినియోగం చేసుకోండి

విశాలాంధ్ర -బొమ్మనహల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ ఫిజీషియన్ ను ఆయా గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి గీత భార్గవి పేర్కొన్నారు గురువారం మండలంలోని ఏ లంజి గ్రామంలో వైద్యాధికారి గీత భార్గవి ఆధ్వర్యంలో ఫ్యామిలీ ఫిజీసియన్ కార్యక్రమం వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా గర్భవతులకు ,బిపి,సుగర్, గుండే జబ్బులు ,పక్షవాతం ,వ్యాధి గ్రస్తులకు రక్త పరీక్షలు నిర్వహించి వైద్యం అందించడం జరిగింది.హై రిష్కు గర్భవతులకు గుర్తించి,వారి కి సుఖ ప్రసవాలు జరిగే విధంగా ఆసుపత్రులకు పంపడం జరిగింది.గర్భవతులు, కిషోర్ బాలికలకు పౌస్తి కాహారం తినాలని,గుండే జబ్బులు,పక్షవాత రోగులు బీడీ, గుట్కా, పొగాకు సంబంధ ఉత్పత్తులు తినరాధని, శారీరక శ్రమ అవసరమని, మద్యం మత్తు పానీయాలు త్రాగ రాధని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ఉమాదేవి ఎం.ఎల్ హెచ్ పి బాలాజీ ఏఎన్ఎం నాగరత్నమ్మ ఆరోగ్య కార్యకర్త వెంకట రమణ, ఆశ వర్కర్లు నాగమణి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img