Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

ఫ్రైడే – డ్రై డే కార్యక్రమం పై అవగాహన

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : ఫ్రైడే – డ్రైడే కార్యక్రమం లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా వీరబ్బాయి జిల్లా మలేరియా అధికారి డి. ఓబులు తో కలిసి నాయక్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధి లోని కృపానందా నగర్ లో శుక్రవారం న ఫ్రైడే డ్రైడై కార్యక్రమాన్ని తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలకు దోమల ద్వారా వచ్చే వ్యాదుల గురించి వాటిలార్వ ల వాటి నివారణ చర్యల గురించి పరసరాల పారిశుద్ధ్యం గురించి ప్రజలకు అవగాహన కల్గించారు. ప్రతి ఇంట్లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమము నిర్వహించి దోమల పెరుగుదలను అరికట్టి, దోమల ద్వారా వ్యాప్తి చెందుచున్న డెంగీ జ్వరాన్ని అరికట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి మద్దయ్య హెల్త్ సూపర్ వైజార్లు సయ్యద్ నూర్ బాషా, శేఖర్, ఏ ఎన్ ఎం అలివేలుమంగా ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img