Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

బంజారాలు బ్రతుకులు మారాలంటే చదువే మార్గము

బంజారా సేవా సంఘం మండల కమిటీ ఎంపిక

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ నందు ఆలిండియా బంజారా సేవా సంఘం సమావేశం మిట్ట ఆంజనేయస్వామి ప్రాంగణమునందు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు అంజినాయక్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు నాగేనాయక్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ చక్రి నాయక్ మరియు ఇతర బంజారా పెద్దలు పాల్గొని బంజారా లు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారానికి మార్గాలు సూచించారు వక్తలు మాట్లాడుతూ బంజారాలు తండాలలో అనేక ఇబ్బందులలో బతుకుతున్నారని ప్రభుత్వము కల్పిస్తున్న రాయితీలు సరిపోక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తాండాలలో సరైనటువంటి వసతులు లేక అటవీ ప్రాంతంలో బ్రతుకుతూ కాలం వెళ్ళబుచుతూ నేటికీ బంజారాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న నాయకులు ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేస్తారు ఓట్లు దండుకొని మొండి చేయి చూపుతున్న వారిని చూస్తున్నాము కావున మన హక్కుల కోసం మనమే పోరాటం చేసి సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని మన పిల్లలను బాగా చదివించుకుని అత్యున్నత స్థాయిలకు ఎదగడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని వారు తెలిపారు సమాజంలో బంజారా లు ఎన్నో రుగ్మతలతో పోరాడుతున్నారని వాటిని చదువు ఒక్కటే మార్గమని వారు తెలిపారు రిజర్వేషన్ ఫలాలను అందిపుచ్చుకోవడానికి సమాజంలో పోటీపడి బ్రతకడం చదువుకోవడం ఎంతో ముఖ్యమని వారు తెలిపారు ఇతర కులాలలో ఎస్టీ జాబితాలో చేర్చకుండా చూడవలసిన అవసరం ఉన్నదని వారు తెలిపారు పెనుకొండ మండలం నూతన కమిటీని ఎంపిక చేసుకున్నారు మండల అధ్యక్షులుగా శ్యాంసుందర్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ,గంగాధర్ నాయక్, గౌరవాధ్యక్షులుగా పోలీస్ నారాయణ నాయక్, ఎంపిక చేసుకున్నారు ఐదు మంది ఉపాధ్యక్షులుగా రామకృష్ణ నాయక్ సెక్రటరీగా శెట్టిపల్లి తిరుపాల్ నాయక్, సెక్రటరీగా సాయి నాయక్, జాయింట్ సెక్రటరీగా సుధాకర్ నాయక్ కార్యదర్శులుగాను ఉపకార్యదర్షులుగాను అనేక మందిని ఎంపిక చేసుకున్నారు యూత్ ప్రెసిడెంట్ గా బాలు నాయక్, సెక్రటరీగా అంజి నాయక్, మరియు అన్ని విభాగాలకు కమిటీలను ఎంపిక చేసుకొని వారందరినీ పూలహారాలతో సన్మానించారు అలాగే బంజారాల అభ్యున్నతి కోసం కష్టించి పనిచేస్తామని ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులను కూడా మండల కమిటీ ఘనంగా సన్మానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img