Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

బస్టాండ్ ఆవరణలో మరుగుదొడ్లు నిర్మించండి

విశాలాంధ్ర – శెట్టూరు : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ ఆదేశాల మేరకు మండలంలోని దళితుల పలు సమస్యలపై తాసిల్దార్, కరెంట్ ఏఈ శెట్టూరు, అనుపల్లి, చెర్లోపల్లి,గ్రామాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ మండల కేంద్రంలో బస్టాండ్ నందు పబ్లిక్ మరుగుదొడ్లు నిర్మించాలని అదేవిధంగా మండల వ్యాప్తంగా ఉన్న దళితులకు భూమిని నిరుపేదలందరికీ భూ పంపిణీలో నిజమైన అర్హత ఉన్న వారిని గుర్తించి పంపిణీ చేయాలని వాడు కోరారు మండలంలో ఉన్న దళితులు సమస్యలపై ఆఫీసుకు వస్తే దళితుల సమస్యలు పరిష్కార మార్గం చూపించాలని వారు అధికారం కోరారు తెలియజేశారు ఈ సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి నిరుపేద దళితులకు న్యాయం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు సాకే గురుమూర్తి అనుపల్లి రామన్న రామ్మూర్తి వెంకటేశ్వర్లు, శివ, అనిల్, వెట్టి తిప్పే స్వామి, మారెన్న చెవుల దివాకర హుస్సేన్ కళాకారుల నరసింహులు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img