విశాలాంధ్ర.. పెనుకొండ.. మండల పరిధిలోని కొండంపల్లి గ్రామంలో గిరిజన కుటుంబం పై వైసీపీ నాయకులు దాడిని ఖండించారు శుక్రవారం వారి కుటుంబానికి పరామర్శించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జిల్లా అధ్యక్షులు పార్థసారధి ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని సత్యసాయి జిల్లా అధ్యక్షుడు బి కే పార్థసారథి అన్నారు. రెండు రోజుల క్రితం జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి స్టిక్కర్ల అందించే కార్యక్రమాన్ని వైసీపీ చేపట్టింది. కొండపల్లి గ్రామానికి చెందిన శ్రీరాం నాయక్ అతని కుటుంబ సభ్యులు గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నారాయణ మా కూతురుకు వస్తున్న వికలాంగ పింఛను 5000 చేస్తామని హామీ ఇచ్చాడని అది నెరవేర్చలేదని ఇప్పుడు ఎలా స్టిక్కర్లు అతికిస్తారని ప్రశ్నించారు. మాట మాట పెరగడం వాగ్వివాదం చోటు చేసుకోవడంతో వైసిపి నాయకులు మూకుమ్మడిగా దాడి చేశారనీ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో జిల్లా అధ్యక్షుడు బికె. పార్థసారథి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఎవరైతే వైసిపి నాయకులు శ్రీరామ్ నాయక్ ఇంటిపై దాడి చేశారు వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేయకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు ఆయనతోపాటుగా సర్పంచ్ శ్రీనివాసులు కృష్ణారెడ్డి నరసింహులు తెదేపా నాయకులు పాల్గొన్నారు.