ఎంపీడీవో బివి రమణ
విశాలాంధ్ర -శింగనమల : శింగనమలమండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో హరిత అనంత ప్లాంటేషన్ కార్యక్రమం కింద ఎంపీడీవో బీవీ రమణ మొక్కలను నాటారు,నాటిన మొక్కలను మహావృక్షాలుగా మార్చాలని, ఇందుకోసం నిరంతరం శ్రమించాలని ఆయన పేర్కొన్నారు.
హరిత అనంత కార్యక్రమం కింద మండల వ్యాప్తంగా విస్తృతంగా మొక్కల పెంపకం చేపడుతున్నట్లు తెలిపారు. నాటిన మొక్కలను నిత్యం సంరక్షించాలని, దత్తత తీసుకున్న వారు ప్రతినిత్యం నీరు పోసి చెట్లను పెరిగి పెద్దయ్యేవరకు కాపాడుకోవాలన్నారు. బాధ్యతగా మొక్కలను సంరక్షణ చేయాలని సూచించారు. నేటి మొక్కలే నాటి మహావృక్షాలని, మొక్కలను పిల్లలతో పాటు పెంచాలన్నారు, ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ విజయ. ఏపీఓ శ్రీదేవి. పంచాయతీ కార్యదర్శి రామాంజనేయులు. సూపర్డెంట్ శ్రీనివాసులు. సీనియర్ అసిస్టెంట్ అక్బర్ వలి. టెక్నికల్ అసిస్టెంట్ ప్రభాకర్. ఫీల్డ్ అసిస్టెంట్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.