విశాలాంధ్ర.. ఉరవకొండ: మాజి ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 116 వ జయంతి వేడుకలను ఉరవకొండలో ఘనంగా నిర్వహించారు. స్థానిక మేజర్ పంచాయతీ కార్యాలయంలో పలువురు వైస్సార్సీపీ నాయకులు, ఉద్యోగ,ఉపాధ్యాయ,దళిత సంఘాల నేతలు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అణగారిన వర్గాలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు.ఇలాంటి స్ఫూర్తిదాయకమైన నేతల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ మీనుగ లలిత, ఎంపీపీ చందా చంద్రమ్మ, జెడ్పిటిసి ఏసీ పార్వతమ్మ, ఉప సర్పంచ్ వన్నప్ప,పార్టీ పంచాయతీ రాజ్ జిల్లా అధ్యక్షుడు బసవరాజు, మాజీ ఎంపిపి ఏసీ ఎర్రిస్వామి, మాజీ జెడ్పిటిసి తిప్పయ్య, కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ గోవిందు, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ మీనుగ ఎర్రిస్వామి, ఓబన్న, వేమన్న,ఓబయ్య,ఈఓ గౌస్ ఉద్యోగ,ఉపాధ్యాయ,దళిత సంఘాలు నేతలు,వైస్సార్సీపీ నాయకులు, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.