Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో తెదేపా ముందుకెళ్తుంది..తెదేపా నాయకులు

విశాలాంధ్ర -ధర్మవరం : బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితోనే తెలుగుదేశం పార్టీ ముందుకెళుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు పురుషోత్తం గౌడ్,నాగురు హుస్సేన్, కృష్ణాపురం జమీర్ అహ్మద్, మారుతి స్వామి, బోయ రవిచంద్ర, గరుగు వెంగప్ప, షీలా మూర్తి, ఇర్షాద్, టైలర్ కులాయప్పలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణములోని ఐసీసీఐ బ్యాంకు వద్ద గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో కుల వివక్షతను దూరం చేసి, అన్ని కులాల వారు సమానమేనన్న గొంతెత్తి చాటిన బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ దేశంలోనే ఒక మంచి స్ఫూర్తి దాయకమైన నాయకులలో ఒకరైన జగ్జీవన్ రామ్ గారు దేశానికి చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని, అతిపిన్న వయసులోనే ఆయన భారతదేశ మొట్టమొదటి కేంద్ర క్యాబినెట్లో స్థానం సంపాదించి ,నిర్విరామంగా 42 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని ,ఆయన నాయకత్వంలో భారతదేశం మరింత ముందుకెళ్లిందని, అటువంటి బాబు జగ్జీవన్ రామ్ జయంతిని జరుపుకోవడం సంతోషదాయకమని పార్టీ శ్రేణులు అన్నారు. నారాచంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశంపార్టీ బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తి ఆశయాలను తప్పకుండా కొనసాగిస్తామని, ప్రజలు మన్నలను పొందుతామనీ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img