Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి

విశాలాంధ్ర, పెద్దకడబూరు : బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని ఎంపీపీ శ్రీవిద్య, జెడ్పీటీసీ సభ్యులు రాజేశ్వరి, వైసీపీ మండల కన్వీనర్‌ రామ్మోహన్‌ రెడ్డి, వ్యవసాయ సలహా మండలి చ్కెర్మన్‌ పురుషోత్తం రెడ్డి అన్నారు. బుధవారం పెద్దకడబూరులోని కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయంలో వైసీపీ మండల కన్వీనర్‌ రామ్మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి 50వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలన్నారు. అలాగే ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర రెడ్డి, గ్రామ సర్పంచ్‌ రామాంజనేయులు, ఉప సర్పంచ్‌ విజయేంద్ర రెడ్డి, నాయకులు రవిచంద్రా రెడ్డి, శివరామరెడ్డి, గజేంద్ర రెడ్డి, పూజారి ఈరన్న, జాము మూకన్న, ముక్కరన్న, తిక్కన్న, అర్లప్ప, కేజిబిజివి ప్రత్యేక అధికారి చైతన్య స్రవంతి, పాఠశాల సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img