Saturday, November 26, 2022
Saturday, November 26, 2022

బాల్‌ బాడ్మింటన్‌లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభ

విశాలాంధ్ర` ధర్మవరం : ఇటీవల పట్టణంలోని క్రీడా మైదానంలో బాల్‌ బ్యాడ్మింటన్‌ జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి, రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపిక కావడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు శైలజ తెలిపారు. అనంతరం వారు మంగళవారం మాట్లాడుతూ అండర్‌ 14 బాలుర విభాగంలో బి. మహేష్‌ బాబు, యు. చిరంజీవి కాగా, అండర్‌ 17 బాలుర విభాగంలో ఎం. పవన్‌ కుమార్‌ ఎన్నిక కావడం జరిగిందని వారు తెలిపారు. ఎన్నిక కాబడిన ఈ క్రీడాకారుల విద్యార్థులందరూ కూడా అన్నమయ్య జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు. తదుపరి విద్యార్థులు అందరిని హెచ్‌ఎం తో పాటు ఫిజికల్‌ డైరెక్టర్లు నవీన్‌ కుమార్‌, నాగేంద్ర, ఉపాధ్యాయులు రఫీక్‌ అహ్మద్‌, హేమలత, శ్రీనివాసులు, శంకర్‌ నారాయణ, ప్రసాద్‌ బాబు, రామకృష్ణ, బోధనేతర సిబ్బంది, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ, అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img