వ్యాయామ ఉపాధ్యాయులు నాగేంద్ర, నవీన్ కుమార్
విశాలాంధ్ర -ధర్మవరం: వేసవికాలంలో పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మంగళవారం నుండి బాల్ బాడ్మింటన్ వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు నాగేంద్ర నవీన్ కుమార్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవికాలంలో సెలవులు ఉన్నందున ప్రతి విద్యార్థి క్రీడల్లో రాణించాలని, ఆ ఉద్దేశంతోనే తాము బాల్ బ్యాడ్మింటన్ క్రీడను నేర్పిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ శిక్షణ శిబిరాన్ని గత 16 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా వారు తెలిపారు.