Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

బిసీ ద్రోహంపై పోరుబాటలో ప్రభుత్వానికి బుద్ధి చెబుదాం

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ టీడీపీ కార్యాలయం నందు శనివారం తెదేపా నాయకులు విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనలో అత్యంత తీవ్రంగా నష్టపోయింది, దగాకు, అణచివేతకు గురి అయినది బీసీలు.ఎంతో మహోన్నత లక్ష్యం కలిగిన సబ్ ప్లాన్ వ్యవస్థను నిర్వీర్యం చేసారు.బీసీల కోసం ఖర్చు చేయాల్సిన 75 వేల కోట్లను దారి మళ్లించి ఆర్థికంగా అనగదొక్కారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు కూడా రాణించాలి,రాజకీయంగా ఎదగాలనే లక్ష్యంతో స్వర్గీయ నందమూరి తారకరామారావు ,చంద్రన్న కల్పించిన 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి కుదించారు,16,800 పదవులు దూరం చేసారు.650 మందిపై తప్పుడు కేసులు పెట్టారు,2,500 మంది బీసీలపై దాడులు, దౌర్జనాలకు దిగారు..ఎంతో మంది తెలుగుదేశం పార్టీ బీసీ నేతలపై అకారణంగా కేసులు పెట్టారు,దాడులకు పాల్పడ్డారు.సోషియల్ మీడియా వేదికగా మహిళ నేతలపై వేధింపులకు దిగారు, సీఐడీ విచారణ పేరుతో అవమానించారు.అందుకే ఈ నెల 18 నుండి 22 వరకు జగన్ రెడ్డి అరాచకాలపై బీసీలందరిని ఏకం చేస్తూ పోరు బాటకు పిలుపునిచ్చాము.జగన్ రెడ్డిని గద్దె దింపి బీసీ బాంధవ్యుడైన చంద్రన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటాము వారు తెలిపారుఈ కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షులు కుంటిమద్ది రంగయ్య, రాష్ట్ర కురుబ సాధికార కన్వీనర్ రమణ, వడ్డే వెంకట్, గిరిధర్ గౌడ్, రాజగోపాల్, అశ్వర్థ నారాయణ, శంకరప్ప, ఆదిశేషు, అనిల్ కుమార్, నాగరాజు, శరత్ తదితరులు పాల్గోన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img