Monday, June 5, 2023
Monday, June 5, 2023

బీసీ ఎమ్మెల్యే పై దాడి చేయడం హేయమైన చర్య

బీసీలు తలుచుకుంటే చర్యకు ప్రతి చర్య ఉంటుంది ఖబడ్దార్

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే శంకర్ నారాయణ పై సోమవారం అసమతి వైసిపి నాయకుడు ఈదుల బలాపురం నాగభూషణ రెడ్డి తన అనుచర వర్గంతో గడపగడపకు వెళ్తున్న ఎమ్మెల్యే పై దాడి చేయించడం అనుచితంగా ప్రవర్తించడం హేమమైన చర్యగా బీసీ నాయకులు మరియు కురుబ సంఘం నాయకులు బుధవారం రహదారులు భవనాలు పాత్రికేయులు సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ నాగభూషణ రెడ్డి చేసిన పని మంచిది కాదని అతను బీసీ ఎమ్మెల్యే పై అనుచితంగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదని అతనికి సమస్యలు ఉంటే ఎమ్మెల్యే దగ్గర చర్చించి అభివృద్ధి కోసం ఒకరినొకరు సహకరించాల్సింది పోయి అవమానపరచడం కించపరచడం ప్రజలతో తిట్టించడం మంచి పద్ధతి కాదని మరల ఇలాంటి పనులు చేస్తే బీసీలు ఊరుకునే పరిస్థితి లేదని అతనికి మొదటి హెచ్చరికగా పద్ధతి మార్చుకోకపోతే పరిస్థితులు వేరుగా ఉంటాయని నీ తప్పుడు పనులకు ఎమ్మెల్యే సహకరించడం లేదని ఇలాంటి పనులకు దిగడం పార్టీని మరింత దిగజార్చడం పనులు చేయకూడదని పెనుకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేసినటువంటి బీసీ నాయకుడుగా ముఖ్యమంత్రి వైఎస్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎంతో అభిమానం ఉన్న శంకర్ నారాయణ వైసీపీ నాయకులు ఇలా చేయడం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామని తమ యొక్క ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి ఇలా చేయడం మంచి పద్ధతి కాదని బీసీలను హక్కున్న చేర్చుకోవడం పట్టే వైసిపి అనంతపురం జిల్లాలో ఇ న్ని స్థానాలు గెలవగలిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాడని కానీ స్థానిక అగ్రవర్ణాల నాయకులు వారి ఆధిపత్యానికి ఎమ్మెల్యే సహకరించడం లేదని ఉద్దేశంతో ఇలాంటి దాడుల్లో చేయించడం బీసీలను ఓ ర్చుకోలేక మనోభావాలు దెబ్బతింటున్నాయని కావున ఎమ్మెల్యే దగ్గర సమస్యలు పరిష్కరించుకోవడానికి సవా లక్ష మార్గాలు ఉన్నాయి కానీ ఆయనను కించపరచడం అవమాన పరచడం మన పార్టీని మనమే అవమానం చేసుకున్నట్లుగా భావిస్తున్నామని నాగభూషణ్ రెడ్డి నీ పద్ధతి మార్చుకోకపోతే నీ తాట తీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని నీకు పదిమంది సహకరిస్తే మేము ఎమ్మెల్యే కు తెలియకుండానే మేము నీ మీద దాడులు చేయడానికి కూడా వెనకాడపోమని మీ అన్యాలను అక్రమాలను ఎండగడతామని కావున పద్ధతిగా మలుచుకోవడం మంచి పద్ధతిగా తెలుపుతున్నామని మొదటి హెచ్చరిక తెలియజేస్తున్నామని అలాగే నీవు వైఎస్ఆర్సిపి పార్టీ అంటే ప్రాణమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా గుండెల్లో ఉన్నారని చెబుతుంటారు కానీ నీవు మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిద్రలేకుండా చేస్తున్న చానల్స్ నీ రప్పించుకోవడం మాట్లాడడం విమర్శలు చేయడం అలాగే దాడులు చేసిన సంఘటనలో పోస్టులు పెట్టడం ఎంతవరకు సబవని నీవు నిజమైన వైఎస్ఆర్సిపి కార్యకర్త అయితే ఇలాంటి పనులు చేస్తావా నీ స్వార్థం కోసం పార్టీని బలి చేస్తున్నావు నీవు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని ప్రశ్నించారు పద్ధతి మార్చుకోకపోతే పరిస్థితులు వేరుగా ఉంటాయని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మశీడ్లి సర్పంచ్ కిష్టప్ప, సానిపల్లి సర్పంచ్ పరమేశ్వరప్ప, అగ్రి చేర్మెన్ కొండలరాయుడు, మండల ఉపాధ్యక్షులు రామాంజనేయులు, హనుమంతు, వెంకట్ రాముడు, ఇతర బీసీ కులాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img