Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

భద్రతా ప్రమాణాలు పాటించాలి

పరిశ్రమల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి

కార్మికుల భద్రత ప్రభుత్వ ధ్యేయం

జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్

విశాలాంధ్ర- పెనుకొండ : పరిశ్రమల పరిధిలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలని, తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం పెనుకొండ మండలంలోని ఎర్రమంచి వద్దనున్న గ్లోవియస్ ఇండియా అనంతపూర్ ప్రైవేట్ లిమిటెడ్, మోబిస్ ఇండియా మోడెల్ ప్రైవేట్ లిమిటెడ్, అమ్మవారిపల్లి వద్దనున్న హుండాయ్ మెటీరియల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సుంగ్ హూ హైటెక్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్, నేషనల్ ఆటో ప్లాస్ట్, కెఎస్హెచ్ ఆటోమేటిక్ ప్రైవేట్ లిమిటెడ్, హుండాయ్ స్టీల్ అనంతపూర్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పరిశ్రమలను పరిశీలించి భద్రతపై పలు సూచనలు, సలహాలు జారీ చేశారు. ఆయా కంపెనీల్లోని ఆయా విభాగాల్లో మిషన్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆయా పరిశ్రమల హెచ్ ఆర్ మేనేజర్ లు అని వివరాలను కూలంకుశంగా జిల్లా కలెక్టర్ కు వివరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా పరిశ్రమల్లో ఎక్కడ ఎలాంటి చిన్నపాటి ప్రమాదం కూడా చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాల నివారణ కోసం చేపట్టాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు.న్ఆయా పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలను అందించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ చాంద్ భాష, ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ కేశవులు, లేబర్ డిప్యూటీ కమిషనర్ రఘురాములు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ శంకర్రావు, పరిశ్రమల శాఖ డిడి మహబూబ్ బాషా, ఆయా కంపెనీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img