అక్రమ భూమి వ్యవహారాలలో నాగరాజు పాత్ర ఎక్కువ
విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం భూ హక్కు దారులు ధర్నా చేసి సబ్ కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందించారు పెనుకొండ మండలానికి సంబంధించిన ముష్రాఫ్, ముస్తారక్ ,ముక్రం అను వారికి సర్వేనెంబర్ 453బి1 453బి4,451 సర్వే నంబర్లు 6 ఎకరాలు భూమి కలదు మా పూర్వీకుల ఆస్తి అన్యాయ క్రతం కావడానికి గౌరవ హైకోర్టు ఉత్తర్వులు తప్పుదారి పట్టించి మోసం చేసిన గత పెనుకొండ తాసిల్దార్ ప్రస్తుత డి ఎ ఓ గా విధులు నిర్వహిస్తున్న నాగరాజునీ వెంటనే సస్పెండ్ చేయాలని పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు భూ హక్కు దారులు కుటుంబాలు ధర్నా నిర్వహించారు. భూ హక్కు దారులు వినతి పత్రాన్ని సబ్ కలెక్టర్ కార్తీక్ కు స్వీకరించి వారి అభిప్రాయం మేరకు తక్షణమే కోళ్ల రామాంజి, వెంకటేష్, గిరి, పార్వతమ్మ వీరి నుంచి ప్రాణహాని ఉందని ఆరోపిస్తున వారిని బైండవర్ చేసే విధంగా పోలీసు అధికారులకు ఆదేశిస్తానని భూ వివాదానికి కారణమైన ఆరోపించబడుతున్న నాగరాజు పై విచారణకు ఆదేశాలు ఇస్తూ తదినంతరం శాఖపరమైన చర్యలకు ఉన్నతిఅదికారులకు నివేదిక ఇస్తానని అదేవిధంగా భూమి సంబంధించిన ఆర్ ఓ ఆర్ రెవెన్యూ కోర్టులో జరుగుతున్న కేసులు తొందరగా రెవెన్యూ చట్ట ప్రకారం పరిష్కరిస్తానని సబ్ కలెక్టర్ కార్తిక్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దన్న, రమేష్, గంగాధర్, వెంకట రాముడు, నారాయణ, బాబావలి, కొండా వెంకటేశులు, నారాయణస్వామి,వజ్రం నాగప్ప, మహబూబ్ బాషా, రెడ్డప్పరెడ్డి, షరీఫ్, రాజు రావు, మహేష్, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.