Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

మద్యం మత్తులో గృహ నిర్మాణ కార్మికుడు ఉరి వేసుకొని ఆత్మహత్య

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని కేతిరెడ్డి కాలనీ-ఎల్ 3 నివాసముంటున్న కోడె కండ్ల నరసింహులు (33) గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయాన మద్యం మత్తులో ఉరివేసుకొని మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు మృతునికి బుక్కపట్నం మండలం బుచ్చయ్య గారి పల్లె శోభకు కొన్ని సంవత్సరాల కిందట ఘనంగా వివాహం జరిగింది. తదుపరి మృతుడు నరసింహులు తాగుడకు బానిసై ప్రతిరోజు ఇంట్లో గొడవ పెట్టుకునే వాడని తెలిపారు. ఇదే క్రమంలో భర్త వేధింపులు తాళలేక భార్య శోభ తన పుట్టింటికి వెళ్ళిపోయింది. తొలుత మృతుడు నరసింహులు ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఆరు నెలల కిందట వెళ్ళిపోయాడు అని తెలిపారు. తదుపరి 10 రోజుల కిందట ఇంటికి చేరుకొని, తన తల్లిని తాగేందుకు డబ్బులను అడిగి వేధించేవాడని తెలిపారు. తల్లి చాకలి వృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తోంది. తాగడానికి డబ్బులు లేవని పదేపదే తల్లి చెబుతూ ఉండేది. క్షణికమైన ఆవేశంలో మృతుడు ఇంట్లోనే ఉరివేసుకొని మృతి చెందాడని తెలిపారు. టూ టౌన్ సీఐ- రాజా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని బంధువులు స్థానికులు కోరుతున్నారు. మృతునికి భార్యతో పాటు ఒక కుమార్తె, ఒక కుమారుడు (చిన్న వయసుగల వారు) ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img