Monday, March 20, 2023
Monday, March 20, 2023

మన సమస్యలను పరిష్కరించే నాయకులను ఎన్నుకుందాం ..సిపిఐ

విశాలాంధ్ర / తనకల్లు .. సమస్యలకు పరిష్కారం చూపే నాయకులను, సమస్యలపై పోరాడే నాయకులను ఎన్నుకొని ఓటు హక్కుకు,ఓటు విలువకు, కొత్త నిర్వచనాన్ని సమాజానికి అందిద్దామని సిపిఐ నాయకులు తెలిపారు కొక్కంటి బొంతలపల్లి నల్లగుట్లపల్లి తనకల్లు జూనియర్ కళాశాల గురుకుల పాఠశాల కోటపల్లి ఈ తోడు తదితర పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి పోతుల నాగరాజు లకు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఐ నాయకులు గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులతోపాటు పట్టభద్రుల సమస్యలు అనేకం ఉన్నాయని వాటిని పరిష్కరించే సత్తా ఈ నాయకులకు ఉందన్నారు. సామాజిక న్యాయం తో పాటు కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులర్ చేయడం ముఖ్యంగా సిపిఎస్ రద్దు ఉపాధ్యాయుల హక్కులు తదితర అంశాలను నెరవేర్చుకోవడంతోపాటు రాజకీయాలలో విలువలను కాపాడుకుందాం అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కన్వీనర్ రెడ్డప్పతోపాటు రైతు సంఘం సహాయ కార్యదర్శి కరీముల్లా తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img