Friday, February 3, 2023
Friday, February 3, 2023

మహబూబ్ సుభాని దర్గా నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం ..కూడేరు గ్రామము లోని శ్రీనివాసు కాలనీ లో భక్తుల కొంగు బంగారం గా వెలసి విరా జిల్లుతున్న మహబూబ్ సుభానీ దర్గా (దస్తగిరి స్వామి) పీఠాధిపతి హజ్రత్ అబ్దుల్ మునాఫ్ అధ్వర్యంలో దర్గా నూతన క్యాలెండర్ ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విశ్రాంత పోలీసుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పీ. పరంథాముఢు, అనంతపురం శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం సహాయక రిజిస్ట్రార్ ఎస్. నాగభూషణం, అనంతపురం జిల్లా కోర్టు న్యాయవాది యమ్. గురు స్వామి అనంతపురం ఏ డి సి సి బ్యాంక్ సి ఈ ఒ గా పనిచేయుచున్న సీ. శివ ప్రసాద్, తరిమెల ప్రభుత్వ ఆయుషు ఉద్యోగి యమ్. ఈశ్వరయ్య, కాంట్రాక్టరు మనోహర్ నాయుడు, మహిళా పోలీసు ఉద్యోగి వై. కుమారి దర్గా ఎలక్ట్రిసియన్ వినోద్ కుమార్, గాలి మిషన్ అబ్దుల్, శివా, దర్గా భక్తాదులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img