Monday, June 5, 2023
Monday, June 5, 2023

మాజీ ఎమ్మెల్యే వసికేరి గోపీనాథ్ సేవలు మరువలేనివి

వసికిరి మల్లికార్జున

విశాలాంధ్ర -ఉరవకొండ : దివంగత మాజీ ఎమ్మెల్యే వసికేరి గోపీనాథ్ పదవ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం ఉరవకొండలో వసికేరి గోపీనాథ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. స్థానిక లయన్స్ క్లబ్బులో వివిధ అర్హత పరీక్షలకు గాను శిక్షణలో ఉన్న విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ 15వ వార్డు సభ్యులు వసికేరి మల్లికార్జున మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ జిల్లా పరిషత్ మెంబర్ గా ఉరవకొండ నియోజకవర్గం శాసన సభ్యులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కురబ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు గొర్రెలు మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా కూడా పదవులను చేపట్టి పార్టీలకు రాజకీయాలకు కులమతాలకు అతీతంగా సేవలు చేశారని కొనియాడారు ప్రధానంగా బడుగు, బలహీన వర్గాల యొక్క సమస్యలపై నిరంతరం పోరాటం చేసి వారి పక్షాన నిలబడ్డ వ్యక్తిగా కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ యొక్క సేవలను గుర్తుకు చేసుకుంటూ ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో గోపీనాథ్ యొక్క సేవలను కురుబ సంఘం రాష్ట్ర నాయకులు వసికేరి శివ, తో పాటు జై కిషన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నాగమల్లి ఓబులేసు, నిస్వార్థ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు వెంకట్ తదితరులు కూడా కొనియాడారు ఈ కార్యక్రమంలో వసికేరి జస్వంత్, కిషోర్, వీరితోపాటు లయన్స్ క్లబ్ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ అభిమానులు కురబసంఘం నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img