విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వీరబ్బాయి సమక్షంలో గురువారం కార్యాలయ సమావేశ భవనంలో మాతా శిశు మరణాల మీద సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పుట్లూరు, నాగసముద్రం, చుక్కలూరు తదితర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జరిగిన మాతృ మరణాల మీద మరియు అనంతపురం పట్టణ ఆరోగ్య కేంద్రం, బ్రహ్మసముద్రం మండలం లో జరిగిన రెండు శిశు మరణాల మీద సంబంధిత వైద్యాధికారులు మరియు క్షేత్రస్థాయి సిబ్బందితో వారు సమీక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ వీరబ్బాయి మాట్లాడుతూ వైద్యాధికారులు గర్భవతులకు మరియు బాలింతలకు అందించు సేవలో 100% అందిస్తే మాతా శిశు మరణాలు సంభవించవని అన్నారు. డి ఐ ఒ డా. యుగంధర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో బాలింతల దగ్గర ఆరోగ్య కార్యకర్త మరియు ఆశా కార్యకర్తలు వారి ఇంటిదగ్గర సమయాన్ని వెచ్చించి వారి ఆరోగ్య సమస్యలు గుర్తించేందుకు కృషి చేయాలి అన్నారు. అదేవిధంగా సమస్యలను గుర్తించిన వెంటనే వైద్యాధికారి దృష్టికి తెచ్చి తగు చికిత్సలు ఎప్పటికప్పుడు అందిస్తే మాతా శిశు మరణాలు జరగవని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ సుజాత, డాక్టర్ యుగంధర్, గైనకాలజీ డాక్టర్ పార్వతి, చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పాల్గొన్నారు