Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

మానవతను చాటుకున్న కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని 25వ వార్డు పరిధిలోని ఎల్సికేపురంలో నివసిస్తున్న రామచంద్ర భార్య కుళ్లాయమ్మ ఆదివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. సమాచారం అందుకున్న ఆ వార్డు కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు మృతుని కుటుంబం వద్దకు వెళ్లి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. అనంతరం తనవంతుగా పదివేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేశారు. ప్రభుత్వం ద్వారా కూడా మరింత సహాయం వచ్చేలా కృషి చేస్తానని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. తన వార్డులో ఆకస్మిక, సాధారణ మరణాలు సంభవించినప్పుడు, అదేవిధంగా విద్య, వైద్య విషయంలోనూ, అత్యవసర, ఆపద సమయాల్లోనూ గత కొన్ని సంవత్సరాలుగా కౌన్సిలర్ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలను పట్టణ ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు.ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img