శ్రీ సత్య సాయి సేవా సమితి నిర్వాహకులు
విశాలాంధ్ర -ధర్మవరం : మానవ సేవను అలవర్చుకొని మానవతను పెంపొందించాలని శ్రీ సత్య సాయి సేవ సమితి నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వారు 350 మంది రోగులకు సహాయకులకు భోజనపు ప్యాకెట్లతోపాటు ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ భోజన పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు, హెడ్ నర్సుల చేతులమీదుగా పంపిణీ చేశారు. భగవాన్ పుట్టపర్తి శ్రీ సత్య సాయి బాబా వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని కొన్ని సంవత్సరాలుగా నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఈ నారాయణ సేవకు (ఉచిత భోజన పంపిణీ)దాతలు కూడా సహకరించడం వల్లనే మేము విజయవంతంగా చేయగలుగుతున్నామని తెలిపారు. నేటి ఈ భోజన పంపి నీకు దాతగా కీర్తిశేషులు దాసరి తులసమ్మ భర్త వెంకట స్వామి వారి విరాళంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ పద్మలత, ప్రభుత్వ ఆసుపత్రి రోగులు, సహాయకులు, శ్రీ సత్యసాయి సేవా సమితి కు సేవాదళ్ సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటువంటి సేవా కార్యక్రమాల వలన దూర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే రోగులకు, సహాయకులకు ఆకలిని తీర్చడం నిజంగా దైవ స్వరూపంతో సమానమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో 17 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.