Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

మానవ సేవ చేయడంలో ఎంతో తృప్తి ఉంది.. సత్యసాయి సేవా సభ్యులు

విశాలాంధ్ర- ధర్మవరం: మానవ సేవ చేయడంలో ఎంతో తృప్తి ఉందని శ్రీ సత్యసాయి సేవా సభ్యులు సాంబశివుడు, ఆచారి, జనార్ధన్, సాగర్ లు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం శ్రీ సత్య సాయి భజన మండలి పాండురంగ స్వామి దేవాలయం-పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం రోగులకు, సహాయకులకు మొత్తం 180 మందికి బ్రెడ్లు, బిస్కెట్లు, పాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ దాతల సహాయ సహకారాలతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మాకు ఎంతో ఆనందంగా ఉందని, నేటి ఈ కార్యక్రమానికి పూజారి కృష్ణమూర్తి, కామాక్షి దంపతుల యొక్క సహకారంతో నిర్వహించడం జరిగిందన్నారు. కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు ఉదయం తో పాటు మధ్యాహ్నము కూడా భోజన పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామని తెలిపారు. దాతలు ఎవరైనా సరే ఇటువంటి కార్యక్రమాలకు ఆసక్తి ఉంటే, భజన మండలి కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ పద్మలత తో పాటు వైద్యులు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమ నిర్వహణ దైవ సేవతో సమానమని, తెలుపుతూ వారికి ఆసుపత్రి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img