Monday, January 30, 2023
Monday, January 30, 2023

మాల ధారణ కార్యక్రమానికి ఎమ్మెల్యే భార్య విరాళం

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని వాసవి దేవాలయంలో ఈనెల 17, 18 వ తేదీలలో వాసవి మాల ధారణ వేసిన భక్తులు యొక్క కార్యక్రమానికి, తన వంతుగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి భార్య సుప్రియ తన చేతులు మీదుగా 20వేల రూపాయల నగదులు విరాళంగా బుధవారం నగర సంకీర్తన సంఘ అధ్యక్షులు గోప చంద్రకు అందజేశారు. ఈ సందర్భంగా గోపాల్ చంద్ర సుప్రియ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వాసవి మాలాధారణ కార్యక్రమంలో ఈనెల 17వ తేదీ భక్తాదులచే లక్షార్చన, అన్నదాన కార్యక్రమం, తిరిగి 18వ తేదీ గ్రామోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కావున భక్తాదులు ఈ కార్యక్రమానికి హాజరై వాసవి మాత ఆశీస్సులు పొందాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img