విశాలాంధ్ర- పెనుకొండ : మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని మంగళవారం మండల పరిధిలోని ఎర్రమంచి సచివాలయ పరిధిలో గల గ్రామాలు కురుబవాండ్లపల్లి మరియు హరిపురం గ్రామాల యందు వైయస్ఆర్సీపీ నాయకులు మండల ఉపాధ్యక్షులు రామాంజనేయులు సమక్షంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన స్టిక్కర్లు మరియు కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్నే మా భవిష్యత్ః అనే నినాదంతో ప్రజలతో మమేకం అవ్వడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు, గత ప్రభుత్వాలకు- జగన్ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించాలని ఆయన కోరారు. నవరత్నాలు పథకాలు ద్వారా అర్హులైన పేదలందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత జగన్ కే దక్కింద నీ అన్నారు. ప్రజలందరూ కూడా జగన్ ఆశీర్వదించాలని వారు ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్ మరియు గృహ సారథులు పె వైసిపి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.