విశాలాంధ్ర -పెనుకొండ : మా నమ్మకం నువ్వే జగన్ః కార్యక్రమాన్ని శనివారం పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని జిఐసి కాలనీ 18 వ వార్డు మరియు మహదేవపల్లి 17వ వార్డు వెంకటరెడ్డి పల్లి 2వ వార్డు, సచివాలయ పరిధిలో గ్రామాలలో నగర పంచాయతీ చైర్మన్ ఉమర్ ఫరూఖ్ ఖాన్ వైస్ చైర్మన్ వైశాలి జయశంకర్ రెడ్డి వైస్ చైర్మన్ సునీల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన స్టిక్కర్లు మరియు కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్నే మా భవిష్యత్ః అనే నినాదంతో ప్రజలతో మమేకం అవ్వడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు, గత ప్రభుత్వాలకు- జగన్ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించాలని ఆయన కోరారు. నవరత్నాలు పథకాలు ద్వారా అర్హులైన పేదలందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత జగన్ కే దక్కింద నీ అన్నారు. ప్రజలందరూ కూడా జగన్ ఆశీర్వదించాలని వారు ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా పట్టణ కన్వీనర్ నరసింహులు అగ్రి చైర్మన్ కొండలరాయుడు 17 వ వార్డు కౌన్సిలర్ రామాంజనేయులు 18 వ వార్డు కౌన్సిలర్ 3 వార్డు పార్టీ ఇంచార్జ్ వెంకటేశులు , తిమ్మారెడ్డి, బోయ బాబు శంకర్ రెడ్డి సచివాలయ కన్వీనర్ రాము ,సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు పాల్గొన్నారు.