విశాలాంధ్ర – ధర్మవరం : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం అనంతపురం జిల్లా నార్పల మండలంలో పర్యటన ఉన్న సందర్భంగా ముందస్తు చర్యగా పట్టణ పోలీసులు సిపిఐ, సిపిఎం నాయకులు జింక చలపతి పోలా రామాంజనేయులు తో పాటు ఇతర నాయకులను కూడా ముందస్తు గానే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వామపక్ష నాయకుల్ని స్టేషన్లోనే కూర్చోబెట్టి మధ్యాహ్నం సొంత పూచి కత్తు కింద విడుదల చేశారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు జింక చలపతి పోలా రామాంజనేయులు మాట్లాడుతూ నేటి ముఖ్యమంత్రి చేనేత కార్మికులకు ఆదుకొనడంలో పూర్తిగా విఫలమయ్యారని, చేనేత కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళాలి అన్న లక్ష్యంతో నార్పలకు వెళ్లడం తప్ప?అని వారు ప్రశ్నించారు. పోలీసుల అరెస్టుకు బెదిరేది లేదని, చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించేంతవరకు మా ఉద్యమాలు ఆగవని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేనేత కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం దారుణమని తెలిపారు. ఇంతవరకు మృతి చెందిన కుటుంబాలకు పూర్తి దశలో ఎక్స్గ్రేషియా ఇప్పించడంలో స్థానిక ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారని తెలిపారు. ఇప్పటికే కరోనా సమయంలో చేనేత కార్మికులు పూర్తిగా దెబ్బతిన్నారని, చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిన్నగా ఉండడం ఎందుకని? వారు మరోసారి ప్రశ్నించారు. మే నెల 8వ తేదీన తాము కూడా చేనేత కార్మికుల సమస్యల పరిష్కారమై ఇంటింటా గుడ్ మార్నింగ్ పేరిటలో పర్యటిస్తూ సమస్యల పరిష్కారానికై పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తోపాటు సిపిఎం ముఖ్యనాయకులు కూడా హాజరవుతున్నట్టు వారు తెలిపారు. తొలుత సిపిఐ నాయకులు జింక చలపతి ఇంటికి పోలీసులు వెళ్లి గృహ నిర్బంధం చేయడానికి వారు ప్రయత్నిస్తే, అందుకు నిరాకరించిన జింక చలపతి కాలినడకన ఎర్ర జెండాలు పట్టుకొని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నినాదాలు పలుకుతూ తమ నిరసనను తెలియజేశారు. అనంతరం కదిరి గేటు వద్ద గల నేతన్న విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ, సీఎం పర్యటనలో భాగంగా నార్పల వెళ్ళడానికి వామపక్ష నాయకులు ప్రయత్నించారు. దీంతో పట్టణ పోలీసులు వారిని అడ్డుకొని నేరుగా పట్టణ వన్ టౌన్ పోలీస్ కు తరలించారు. తదుపరి సిపిఎం నాయకులు పోలా రామాంజనేయులు నేరుగా ఇంటి వద్దకే వెళ్లి వారిని కూడా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అరెస్ట్ అయిన వారిలో సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, సిపిఎం పట్టణ కార్యదర్శి పెద్దన్న ,నాయకులు.. వెంకటనారాయణ, వెంకటస్వామి, భుజంగం, శ్రీధర్లు కూడా ఉన్నారు.