Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

ముగిసిన చదరంగం, టేబుల్ టెన్నిస్ శిక్షణ తరగతులు

నిర్వాహకులు శివకృష్ణ

విశాలాంధ్ర – ధర్మవరం:: ప్రతి సంవత్సరము వేసవి సెలవుల్లో చదరంగము టేబుల్ టెన్నిస్ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే గత 25 రోజులుగా కళాజ్యోతిలో ఉచిత వేసవి చదరంగం టేబుల్ టెన్నిస్ లు ఎంతో ఉత్సాహంతో నిర్వహించారు. ఈ క్రీడలు బుధవారంతో ముగిశాయి. ముగింపు సభకు ముఖ్య అతిథులుగా కళాజ్యోతి కార్యదర్శి, గౌరవాధ్యక్షులు తోపాటు సింగనమల రామకృష్ణ, ఏపీ స్టేట్ చెస్ అసోసియేషన్ సహకార దర్శి రమేష్ బాబు, రిటైర్డ్ అధ్యాపకులు సోమశేఖర్ ప్రసాద్, హిందీ టీచర్ వేణుగోపాలచార్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు రమేష్, ఆర్చిటర్ ఆదిరత్నకుమార్ విచ్చేయడం జరిగిందన్నారు. శిక్షణలో పాల్గొన్న వారందరికీ కూడా బీఎస్కే చెస్ అకాడమీ వారు బహుమతులను అందజేశారు. ఈ శిక్షణలో చెస్లో 50 మంది టేబుల్ టెన్ ఇయర్స్ లో 20 మంది శిక్షణ పొందడం జరిగిందన్నారు. ఈ శిక్షణను టేబుల్ టెన్నిస్ శిక్షకుడు నాగేంద్ర, చెస్ శిక్షకుడు శివకృష్ణ తర్ఫీదు ఇచ్చారని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం పట్ల ముఖ్య అతిథులు శివకృష్ణను అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img