Friday, March 24, 2023
Friday, March 24, 2023

మున్సిపాలిటీ స్థలాలను కాపాడుటలో కౌన్సిలర్లు సహాయ సహకారాలు అందించాలి.. మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని మున్సిపాలిటీ స్థలాలను కాపాడుటలో వార్డు కౌన్సిలర్లు కూడా తమ సహాయ సహకారాలను అందించినప్పుడే నివారణ సాధ్యమవుతుందని మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల పేర్కొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిల్ హాలులో మంగళవారం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అనంతరం అజెండా అండ్ టేబుల్ అజెండాలోని అంశాలను చదివి వినిపించారు. తదుపరి ఆ అంశాలకు సంబంధించినటువంటి అనుమానాలను చైర్మన్ తో పాటు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున కూడా నివృత్తి చేశారు. అనంతరం వైస్ చైర్మన్ నాగరాజు మాట్లాడుతూ ఒక సంవత్సరం కాలంలోనే నూతన కాయగూరల మార్కెట్ కాంప్లెక్షను నిర్మించుటలో ఎమ్మెల్యే ఎనలేని కృషి చేయడం ఇది మనందరికీ ఎంతో గర్వించదగ్గ విషయమని, ప్రజలను వ్యాపారస్తులను అభివృద్ధి బాటలో నడుపుటలో ఎమ్మెల్యే చేసిన కృషికి కౌన్సిలర్లు అందరూ కూడా అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి పట్టణంలోని మున్సిపల్ స్థలాలను గుర్తించి వాటినీ ఆక్రమించకుండా పెంచింగ్ ఏర్పాటు అతి త్వరలోనే చర్యలు చేపడతామని మున్సిపల్ కమిషనర్ వివరణ తెలియజేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకే వాడు కౌన్సిలర్లుగా, తాము ప్రజల సమస్యలపై మాట్లాడుతున్నామని, అధికారులు సహకరించకపోవడం బాధాకరమని కౌన్సిలర్ జెసిబి రమణ తెలుపగా, చైర్మన్ బదులిస్తూ మున్ముందు ఇటువంటి పొరపాటు జరగకుండా చూడాలని కమిషనర్ కు సూచించారు. ఎండాకాలం రానందున నీటి సమస్యలపై మున్ముందు చర్యలు చేపట్టాలన్నారు. వార్డు సమస్యలపై చెత్త వాహనాలు రావటం లేదని, దాదాపు పది రోజులుగా ఆయా వార్డుల్లో అపరిశుభ్రం చోటు చేసుకోవడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇందుకు స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ చెత్త ఆటో వాహనాల డ్రైవర్లకు జీతాల విషయంలో కొన్ని కారణాలు ఉన్నందున, త్వరలోనే సమస్యను పరిష్కరించి ప్రతిరోజు ఆటోలు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీధి దీపాలు, డ్రైనేజీ సమస్యలు, ప్రతి కౌన్సిల్ హాల్లో తెలుపుతున్న కూడా సమస్యలు పరిష్కారం కాలేదని మరో కౌన్సిలర్ చైర్మన్ దృష్టికి తెచ్చారు. చైర్మన్ స్పందిస్తూ ఇకనుంచి అటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. తదుపరి రెండవ వార్డ్ కౌన్సిలర్ జయరామిరెడ్డి ఎన్నికల ముందు ఆ వార్డు ప్రజలకు రోడ్డు అవసరాల నిమిత్తం రెండున్నర సెంటు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఆ కౌన్సిలర్ రెండున్నర సెంట్లు స్థలముతో పాటు, మున్సిపల్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. దాదాపు 12న లక్షలు మున్సిపాలిటీకి దాన విక్రయంగా ఇవ్వడం పట్ల చైర్మన్ తో పాటు, వైస్ చైర్మన్లు పెనుజురు నాగరాజు, భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, మున్సిపల్ అధికారులు, కో ఆప్షన్ నెంబర్లు, కౌన్సిలర్లు అంతా కలిసి కౌన్సిలర్ జయరామిరెడ్డిని అభినందించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మేనేజర్ ఆనంద్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img