Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తే ఖబర్దార్.. పరిటాల శ్రీరామ్

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని ముస్లింల సమాధులను బుధవారం రాత్రికి రాత్రే సమాధులను తొలగించి, చదును చేయడం సరియైన పద్ధతి కాదని ముస్లిముల మనోభావాలను దెబ్బతీస్తే ఖబర్దార్ అని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ఎమ్మెల్యే కేతిరెడ్డిని, వైఎస్ఆర్సిపి నాయకులను హెచ్చరించారు. ఈ సందర్భంగా గురువారం వారు పట్టణములోనీ గాంధీ నగర్ లో సమాధులను తొలగించిన స్థలాన్ని వారు పరిశీలించి, బాధను వ్యక్తం చేశారు. అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ మట్టి సాకు పేరుతో, సమాధులు తొలగించి, మృతి చెందిన కుటుంబాల యొక్క మనోభావాలను దెబ్బతీయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు?. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పట్టణ ముస్లిం సోదరులకు సమాధానం చెప్పాలని వారు తెలిపారు. తప్పును తప్పుగా ఒప్పుకునేంతవరకు, ముస్లింలకు తాము అండగా ఉంటూ, పోరాటాలు సలుపుతామని హెచ్చరించారు. ముస్లింల సమాధులను నేలమట్టం చేయడం దుర్మార్గమైన చర్యమని, ముస్లిం మత పెద్దలతో సంప్రదింపులు జరపకుండా, ఏకపక్షంగా సమాధులను పూడ్చడం దారుణమని తెలిపారు. పితృదేవతలకు దువా చేసుకునే అవకాశం లేకుండా చేయడం చాలా బాధాకరమన్నారు. సమాధుల స్థలాన్ని అభివృద్ధి పరచాలే తప్ప, ఇలాంటి సంఘటనలు ఎక్కడా కూడా జరగలేదన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కమతం కాటమయ్య, పని కుమార్, నాగురు హుస్సేన్, పటాన్ బాబు, చింతపులుసు పెద్దన్న, పురుషోత్తం గౌడ్, కృష్ణాపురం జమీర్ అహ్మద్, రాళ్లపల్లి షరీఫ్, అత్తర్ రహీం భాష, శామీర్, భీమనేని ప్రసాద్ నాయుడు, అంబటి సనత్, ఉస్మాన్, చీమల రామాంజి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img