Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

ముస్లిం క్యాలెండర్స్ విడుదల

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని పదవ వార్డ్ ఇంచార్జ్ కృష్ణాపురం జమీర్ ఆధ్వర్యంలో శనివారం నాడు వారి స్వగృహంలో మదరస-ఏ-కాశీ ఫుల్ ఉలూమ్ ట్రస్ట్ సభ్యులు, మౌలానా షాపులు కలసి ముస్లిం క్యాలెండర్లను విడుదల చేశారు. అనంతరం జమీర్ అహ్మద్ మాట్లాడుతూ ఈ క్యాలెండర్ ప్రత్యేకంగా నమాజు సమయపాలన కోసం మహిళలకు, యువకులకు ఎంతో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ నా చేతులు మీదుగా చేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. ముస్లిం సమస్యల పరిష్కారానికై తన వంతు కృషి ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు, మౌలానా సాబులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img