Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

మూల విరాట్ విగ్రహాలు గ్రామోత్సవం

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని దుర్గా నగర్ లో ఈనెల 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీ శీతలా దేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. ఇందులో భాగంగా నాలుగవరోజు శనివారం ఉదయం ప్రత్యేక పూజలతో పాటు ప్రతిష్ట దేవతల మూల మంత్ర, దీక్ష, పుష్యాది, వాసాంగ హోమాలు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేకమైన వాహనములో పూలతో అలంకరించబడిన వాటిలో మూలవిరాట్ విగ్రహాలైన వినాయకుడు, శివుడు, పార్వతి దేవి, కాలభైరవి, సుబ్రహ్మణ్య స్వామి, శీతలాదేవి, శ్రీ చక్రం, ఆదిత్యాది నవగ్రహాలు, వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను పట్టణ పురవీధుల గుండా ఘనంగా ఊరేగించారు. ప్రతిరోజు పూజా కార్యక్రమాలను పార్నంది ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో జ్యోతిష్య ఆగమ పండితులు రాధా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. ఈ హోమాలు పారాయణధులు ఆరు మంది రూట్థ్వీకుల సహకారంతో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నము, రాత్రి భక్తులకు భోజనాన్ని పంపిణీ చేశారు. తిరిగి సాయంత్రం నుండి ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు విజయ్ గురు స్వామి వారి భజన బృందం యొక్క భజన, కృష్ణ చైతన్య దుర్గా నగర్ భజన సేవా కమిటీ వారి భజన, ఎర్రగుంట సంజీవప్ప భజన బృందం వారి భజన, ఎర్రగుంట సంజీవప్ప భజన బృందం వారి భజన, దుర్గమ్మ భజన సేవా కమిటీ వారి భజన కార్యక్రమాలు భక్తాదులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ మహోత్సవ వేడుకలు ఆదివారముతో ముగియను ఉన్నాయని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సాకే చిన్నకృష్ణ ,బెస్త రామకృష్ణ మాట్లాడుతూ ఈ ఆలయ నిర్మాణముకు121 మంది 5 లక్షల నుండి10,116 రూపాయల వరకు నగదును విరాళంగా ఇచ్చిన వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలతో పాటు ప్రత్యేక పూజలు కూడా చేయించారు. ఈ కార్యక్రమంలో గుడి నిర్మాణ సేవాకర్తలు సింగంశెట్టి రామాంజనేయులు, లక్ష్మీనారాయణ, గౌరవం రాము ,పసులూరి పెద్ద పోతులయ్య, పంకం నాగరాజు, అంకె నారాయణస్వామి, బాబయ్య, ఎర్ర జిన్నెల అశ్వత్థ నారాయణ తోపాటు అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img