Monday, June 5, 2023
Monday, June 5, 2023

మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనమును పంపిణీ చేయాలి.. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు

విశాలాంధ్ర- ధర్మవరం : ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనమును అందించాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మంగళవారం పట్టణము, గ్రామీణ ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం ఎలా ఉంది? నాణ్యతగా విద్యార్థులకు అందజేస్తున్నారా? లేదా? అదేవిధంగా విద్యార్థులకు చదువును సిలబస్ ప్రకారం జరుగుతుందా? అన్న విషయాలను హెచ్ఎం. శైలజ ద్వారా అడిగి తెలుసుకున్నారు. చేసిన వంటకాలలో భోజనాన్ని పరిశీలించి, కలెక్టర్ తో పాటు ఇంచార్జ్ డీఈవో మీనాక్షి దేవి కూడా రుచి చూసి,సంతృప్తిని వ్యక్తం చేస్తూ పలు సూచనలను తెలియజేశారు. ప్రతిరోజు ఇలాగే నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని వారు హెచ్ఎం కు సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ఁజగనన్న గోరుముద్దఁకు మంచి పేరును తేవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు ఇంచార్జ్ డిఇఓ మీనాక్షి దేవి, తహసిల్దార్ యూగేశ్వరి దేవి, హెచ్ ఎం. శైలజ పాల్గొన్నారు. తదుపరి పట్టణములోని ఎల్సికేపురం అంగన్వాడీ కేంద్రం 1 అండ్ 2 కేంద్రాలను పరిశీలించారు. అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన భోజనమును అందించాలని ఆదేశించారు. భోజనం నాణ్యతలో మరింత పురోగతి చూపించాలని తెలియజేశారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని తెలుపుతూ విద్యార్థుల హాజరు రిజిస్టర్ను వారు పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాలకు ఎన్ని కోడిగుడ్లు వచ్చాయి? స్టాక్ బ్యాలెన్స్? బుక్ బ్యాలెన్స్ ఎలా ఉంది అనేది కూడా తనిఖీ చేశారు. అనంతరం చిన్నారులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి విద్య ప్రమాణాలను పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంగన్వాడీ కేంద్రాలలో మంచి విద్యను అంగన్వాడీ టీచర్లు బోధించాల్సిన బాధ్యత ఉంది అని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ యుగేశ్వరి దేవి, ఐసిడిఎస్ సూపర్వైజర్లు రాజేశ్వరి, అరుణ, అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు పాల్గొన్నారు. తదుపరి మండల పరిధిలోని పోతుల నాగేపల్లి పంచాయతీ పరిధిలోని చిన్న కుంట వంక వద్ద అమృత్ సరోవర్ పనులు చేస్తున్న ఉపాధి హామీ పనులను కలెక్టర్ పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న 200 మంది ఉపాధి కూలీలతో నేరుగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి కూలీ వారు మాట్లాడుతూ పనిముట్లు సరిగా లేవని, తాగునీరు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అమృత్ సరోవర్ పాండ్ పనులను 20 లక్షల రూపాయలతో చేపడుతున్నామని పనులను సకాలంలో పూర్తి చేయాలని వారు ఆదేశించారు. అంతేకాకుండా జీవన ప్రమాణాలను కూలీలు మరింత పెంపొందించుకోవాలని తెలిపారు. ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజులు పాటు ఉపాధి పనులు చేయడం వలన రూ.27,200 రూపాయలను ఒక జాబ్ కార్డు కలిగిన వారు సంపాదించుకునే అవకాశం ఉందని, వీటిని గుర్తించి కూలీలు సద్వినియోగం చేసుకుంటూ ఎక్కువ మంది కూలీల పనులకు వచ్చేలా చూడాలని తెలిపారు. అంతేకాకుండా ఉపాధి కూలీలకు తాగునీరు మెడికల్ కిట్టు లాంటి కనీస సౌకర్యాలు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని వారు అధికారులను ఆదేశించారు. ఎండలు అధికంగా ఉన్నాయని వడదెబ్బ తగలకుండా ఉపాధి కూలీలు తగిన జాగ్రత్తలను వహిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎంపీడీవో మమతా దేవి, ఎంపీపీడీవో చలపతి, డ్రామా ఎండి శివశంకర్, సర్పంచు, ఏ పీ ఓ అనిల్ కుమార్ రెడ్డి, హార్టికల్చర్ సూపర్వైజర్ అరుణ, టెక్నికల్ అసిస్టెంట్ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img