Tuesday, May 30, 2023
Tuesday, May 30, 2023

మోడల్ స్కూల్ లో ఆరవ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోండి.. ప్రిన్సిపాల్ పద్మశ్రీ

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని గుట్టకింద పల్లెలో గల మోడల్ (ఆదర్శ) స్కూల్లో ఆరవ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ పద్మశ్రీ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దరఖాస్తులు ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని, అదేవిధంగా పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టీ వారికి 75 రూపాయలు, ఓసి, బీసీ వారికి రూ .150 ఉంటుందన్నారు. ఆన్లైన్లో దరఖాస్తులను ఈనెల తొమ్మిదవ తేదీ నుండి 25వ తేదీ వరకు అవకాశం ఉందని తెలిపారు. ప్రవేశ పరీక్ష జూన్ 11వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 79811 71568 కు గాని 6305974274 కు సంప్రదించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img