Saturday, June 3, 2023
Saturday, June 3, 2023

మోపిడిలో గడప గడపకు మన ప్రభుత్వం

విశాలాంధ్ర -ఉరవకొండ: ఉరవకొండ మండలం మోపిడి గ్రామంలో గురువారం రెండవరోజు మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఃగడప గడపకు మన ప్రభుత్వంః కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి గడపకు వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాలను ఆయన వివరించారు.ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతీ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img